Tuesday, 23 February 2016

రెండవ కవిత : సంకేతాలతో నా మనో ఉత్తరం

                                    సంకేతాలతో నా మనో ఉత్తరం 

Tuesday, 27 November 2012

మొదటి కవిత : ఆకృతి


                      ఆకృతి
నా డెందమనే నిశ్శబ్ద ఆవరణలో
కన్ను చీల్చినా కానరాని చీకటిలో
వెలుగు కొరకై తరచి చూసే వెర్రిబాగుల వేటలో
తోడు కొరకై పరితపించే ఎండమావి తృష్ణలో
కాలక్రమమే మరచిన కాలయాపనలో
కాలమాన కొలమాన వాయు వేగ గమనములో
నిరర్ధకమై గడచిన జీవిత ప్రధమార్ధమును
విశదీకరించుకొను విభిన్న తరుణములో
అల్లదుగో అగుపడింది సుదూర తీరాన
విస్పష్ట క్రాంతి వోలె, వినూత్న భ్రాంతి వోలె
హర్షాతిరేకములు  పరిఢవిల్లగా, కుతూహలమ్ము అతిశయింపగా
తృటిలో తనను చేరుకోవాలనే ఆరాట పోరాటములో
పరుగిడి పరుగిడి అలసి సొలసిన వేళ
విసిగి వేసారి సేద తీరే వేళ
ఎడబాసిన ఎడద సాగోరు వేళ
చపల చిత్తము స్థిరమైన వేళ
మస్తిష్క యోచనలు రాటుదేలిన వేళ....
ఈ వేళ ఇప్పటికి ..
విస్పష్టమయ్యేను ఆ ఆకృతి ..
కష్టాల నీడలో తోడుగా నిలచి, ఇష్టాల జాడలో నన్ను నడిపించే..

వెలుగులీను ఆ ఆకృతి .... నా ఆకృతి.